Karthik Varma : సుకుమార్ శిష్యుడు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్లో సందడి నెలకొంది. కార్తీక్ తాజాగా హరిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు సినీ సెలబ్రిటీలు వచ్చారు. నాగచైతన్య-శోభిత దంపతులు, సాయిధరమ్ తేజ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు సినీ నటులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కార్తీక్ వర్మ ఎంగేజ్ మెంట్ అంటూ గతంలో కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.
Read Also : Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
కానీ అవి కేవలం పెళ్లి చూపులకు సంబంధించినవే అని తెలుస్తోంది. తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ లో లేదంటే జనవరిలో పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉంది. కార్తీక్ వర్మ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. సుకుమార్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు నాగచైతన్యతో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఆయన ఎంగేజ్ మెంట్ చేసుకున్న హరిత బంధువుల అమ్మాయి అని తెలుస్తోంది.
Read Also : Saif Ali Khan : ఆమెకు ముద్దు పెడితే వెయ్యి ఇచ్చేది.. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్