గత రెండు రోజులుగా పాకిస్తాన్- ఇరాన్ పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా ప్రతిపాదించింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండాలని డ్రాగన్ కంట్రీ కోరింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ గురువారం తెల్లవారుజామున దాడులు చేసి తొమ్మిది మందిని చంపింది.. ఇక, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సున్నీ బలూచ్ తీవ్రవాద గ్రూపు జైష్-అల్-అద్ల్ యొక్క రెండు రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మంగళవారం ఇరాన్ క్షిపణి, డ్రోన్లతో దాడులు చేసింది.
ఇక, పశ్చిమాసియాలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇరాన్ సహాయం చేస్తుండగా.. పాకిస్తాన్ దాని సన్నిహిత మిత్రుడు కావడంతో ఈ పరిణామం చైనాను డైలమాలో పడేసింది. చైనా కూడా ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్- అంతర్జాతీయ చట్టం యొక్క ప్రయోజనాలు, సూత్రాల ఆధారంగా దేశాల మధ్య సంబంధాలు కొనసాగేలా చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. సార్వభౌమత్వం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత అన్ని దేశాలు గౌరవించబడాలన్నారు. ఇరాన్- పాకిస్తాన్ సన్నిహిత పొరుగు దేశాలు.. కాబటి ఇరు పక్షాలు సంయమనం, శాంతిని పాటిస్తాయన్నారు.
Read Also: PM Modi South Visit: నేడు సౌత్ ఇండియాలో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
అయితే, అవసరమైతే, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చైనా ప్రకటించింది. సంప్రదింపులు, చర్చల ద్వారా ఇరుపక్షాలు తమ వివాదాలను పరిష్కరించుకుంటాయి.. సున్నీ-ఆధిపత్యం ఉన్న పాకిస్తాన్ అలాగే, షియా-ఆధిపత్యం ఉన్న ఇరాన్‌తో సత్సంబంధాలు లేనందున చైనా మధ్యవర్తిత్వ ప్రతిపాదన కష్టతరమైంది.