HMPV Cases: కఠినమైన నిఘా ఉన్నప్పటికీ భారతదేశంలో కొత్త HMPV కేసులు నిరంతరం ఎక్కడో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వారంలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరిలలో కొత్త HMPV కేసులు నమోదయ్యాయి. HMPV గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, చైనా నుండి ఒక శుభవార్త వచ్చింది. చైనాలో HMPV వైరస్ కేసులు తగ్గడం ప్రారంభించాయి. కానీ భారతదేశం ఇంకా ఊపిరి పీల్చుకునే సమయం కాలేదు.
“హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్త వైరస్ కాదు, కనీసం రెండు దశాబ్దాలుగా ఇది మనతో ఉంది” అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ విలేకరుల సమావేశంలో పరిశోధకుడు వాంగ్ లిపింగ్ అన్నారు. 2001లో నెదర్లాండ్స్‌లో తొలిసారిగా గుర్తించబడిన ఈ వైరస్ కేసుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో పెరిగిందని వాంగ్ చెప్పారు. ఇప్పుడు HMPV కేసుల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతోందని, ఉత్తర ప్రావిన్సులలో పాజిటివ్ కేసుల రేటు తగ్గుతోందని ఆయన అన్నారు.
Read Also:Bhatti Vikramarka: తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవు..
భారతదేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి?
భారతదేశంలో పుదుచ్చేరి నుండి సోమవారం నాడు ఒక హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్త కేసు నమోదైంది. అక్కడ ఒక అమ్మాయి జ్వరం, దగ్గు, ముక్కు కారుతున్నట్లు ఫిర్యాదు చేసింది. పరీక్షలు ఆమెకు HMPV తో బాధపడుతున్నట్లు నిర్ధారించాయి. ఈ కేసు తర్వాత భారతదేశంలో ఇప్పుడు మొత్తం 17 HMPV కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో అత్యధికంగా ఐదు కేసులు ఉన్నాయి. తరువాత మహారాష్ట్ర, కోల్‌కతాలో మూడు, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో రెండు, అస్సాంలో ఒక కేసు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
HMPV లక్షణాలు, నివారణ?
HMPV వల్ల దగ్గు, జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇది ఎక్కువగా చిన్న పిల్లలను ఎక్కువగా బాధిస్తుంది. దీని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, తినడానికి ముందు మీ చేతులను కడుక్కోండి. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సంబంధం పెట్టుకోవద్దు. దగ్గు, జలుబు లేదా జ్వరం ఉంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
Read Also:Trinadha Rao: నోటి దురద కామెంట్స్.. చిక్కుల్లో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు?