China: 2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ లిన్ జికియాంగ్ ప్రకటించారు. సన్నాహకాల్లో భాగంగా ముందుగా అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను మంగళవారం పంపుతున్నట్టు ఆయన తెలిపారు.
మంగళవారం ఉదయం 9.31 గంటలకు తన సొంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను చైనా పంపనుంది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్ హైపెంగ్, జూయాంగ్జూ, పౌర వ్యోమగామి గుయ్ హైచావో అయిదు నెలల వరకూ అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లనున్న షెంజావో-16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్ మంగోలియాలోని జ్యూకాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లినవారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. ఈ అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములను టియాగాంగ్ అనే అంతరిక్ష కేంద్రానికి తీసుకెళుతుందని లిన్ చెప్పారు. చంద్రుడిపై మనుషులతో కూడిన అన్వేషణ కార్యక్రమాన్ని చైనా ఇటీవలే ప్రారంభించింది. 2025 నాటికి తమ వ్యోమగాములను పంపుతామని నాసా, చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రకటించిన నేపథ్యంలో చైనా కూడా తమ మిషన్‌ను మొదలు పెట్టింది.
Also Read
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
- ENG W vs SL W: శతకంతో 'డ్యానీ వ్యాట్' వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
- Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
Read Also: Gehlot vs Pilot: అశోక్, సచిన్‌ల మధ్య కుదిరిన రాజీ ఫార్ములా.. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు
భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు లిన్ జికియాంగ్ చెప్పారు
తాజావార్తలు
-
Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
-
Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!