Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News China Preparing For War But Centre Is Sleeping Says Rahul Gandhi

Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కానీ బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోంది..

Published Date :December 16, 2022 , 5:40 pm
By Mahesh Jakki
Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కానీ బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: దేశ సరిహద్దుల వద్ద భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ మాత్రమే చేసిందని రాహుల్‌ గాంధీ అన్నారు. కానీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దానిని అంగీకరించడం లేదన్నారు. డ్రాగన్‌ యుద్ధానికి కాలు దువ్వుతుంటే.. బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నా.. కేంద్రం నిద్రపోతోందని ఆరోపించారు.”ప్రస్తుత పరిస్థితిని బట్టి చైనా చొరబాటుకు సిద్ధపడటం లేదు, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడుతోంది. ముప్పు స్పష్టంగా ఉంది, కానీ మన ప్రభుత్వం బెదిరింపును విస్మరిస్తోంది. కేంద్రం మన నుంచిస్తవాలను దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాలను ఎక్కువ కాలం దాచలేం” అని రాహుల్ గాంధీ అన్నారు.

చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. చైనా తీరు చూస్తే వారు లడఖ్, అరుణాచల్ వైపులా సన్నాహాలు చేస్తున్నారు, కానీ భారత ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 300 మందికి పైగా చైనా సైనికులు 17,000 అడుగుల శిఖరానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. భారత పోస్ట్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించారు, అయితే వారి ప్రయత్నాలను భారత వైపు బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ఘర్షణ జరిగిన వెంటనే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Bilawal Bhutto Zardari: “బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ..” ప్రధాని మోదీపై పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ యాత్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ప్రస్తుతం ఈ యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్ర దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల వ్యవధిలో 3,570 కిలో మీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి బయలుదేరిన యాత్రలో దాదాపు 2,600 కి.మీలను పూర్తి చేసింది. రాజస్థాన్‌ను కవర్ చేసిన తర్వాత, యాత్ర డిసెంబర్ 21న హర్యానాలోకి ప్రవేశిస్తుంది.

#WATCH | China is preparing for war, but our government is not accepting it, it is hiding this fact: Congress MP Rahul Gandhi, at Jaipur, Rajasthan pic.twitter.com/6K1gAdvaY6

— ANI (@ANI) December 16, 2022

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arunachal pradesh border clash
  • bharat jodo yatra
  • bjp government
  • china
  • China preparing for war

తాజావార్తలు

  • Mamata Banerjee: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..

  • Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..

  • Vivo V70 FE: వివో V70 FE 5G ఫోన్‌ విడుదల.. 200MP కెమెరా, 7,000 mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?

  • Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..

  • Amba’s Revenge: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం.. తొలి ఏఐ చిత్రంగా ‘అంబ’s రివెంజ్’!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions