China Lifts Quarantine: జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్‌ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే. అది సోకిన వాళ్లపై ఎలాంటి కఠిన ఆంక్షలూ లేవు. కరోనా కఠిన నిబంధనలతో మూడేళ్లుగా ప్రపంచం నుంచి తనను తాను వేరు చేసుకున్న డ్రాగన్.. యధాస్థితికి వచ్చేందుకు సిద్ధపడింది. జీరో కోవిడ్ పాలసీ అంటూ గతేడాది వరకూ మూడేళ్లపాటూ అత్యంత కఠిన క్వారంటైన్ ఆంక్షలు పెట్టిన చైనా.. సడెన్‌గా ఇలా నిర్ణయం మార్చుకోవడానికి కారణం ప్రజా ఆందోళనలే. కరోనా పట్ల ప్రభుత్వ తీరు మారాలని ప్రజలు రోడ్లకు ఎక్కుతూనే ఉన్నారు.
చైనాలో అవలంభించిన జీరో కొవిడ్ పాలసీ దారుణంగా ఫెయిల్ అయ్యింది. కరోనా మహమ్మారి తగ్గకపోగా మరింత రెచ్చిపోయింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు ఆంక్షల్ని ఎత్తివేసి కోవిడ్‌ను జయించాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి మెరుగుపడి కరోనా పోయింది. ఇప్పుడు చైనా కూడా ఇదే రూట్ ఫాలో అవ్వాలని యోచిస్తోంది. ఇవాళ్టి నుంచి చైనాలోని అన్ని ఎయిర్‌పోర్టులూ, ప్రయాణాలు, వ్యాపారాలు, ఓడరేవులు అంతటా ఆంక్షలేవీ ఉండవని శనివారం డ్రాగన్ ప్రకటించింది. ఇక దేశాల మధ్య సరిహద్దు ఆంక్షలు లేవు. అంతేకాదు విదేశాల నుంచి చైనాకు వచ్చేవారికి క్వారంటైన్, కరోనా పరీక్షలు ఉండవు. అంతేకాదు క్వారంటైన్‌లో ఉన్నవారిని ఇవాళ విడుదల చేస్తారు. వారి ఆస్తుల్ని వారికి అప్పగిస్తారు. వారిపై ఉన్న కేసుల్ని తొలగిస్తారు. ఆందోళన చేస్తున్నవారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
Himachal Pradesh Cabinet: హిమాచల్ కేబినెట్ విస్తరణ.. విక్రమాదిత్య సింగ్ సహా 7గురు ప్రమాణం
ఓ వైపు ఆంక్షలను ఎత్తివేసినా చైనాలో కరోనా తగ్గుముఖం పడుతుందా అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు క్వారంటైన్ ఎత్తివేయడం కరెక్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. చైనాలో శనివారం కొత్తగా 10,681 కేసులు నమోదు అయ్యాయి. దానికి తోడు జనవరి 22న చైనా ప్రజలు భారీ ఫెస్టివల్ చేసుకోబోతున్నారు. దాని కోసం వారు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలకు కలవరం కలిగిస్తోంది. క్వారంటైన నిబంధనల ఉల్లంఘనను ఇకపై క్రిమినల్ చర్యగా పరిగణించొద్దని శనివారం జారీ అయిన ఉత్తర్వుల్లో చైనా సర్కారు పేర్కొంది.