భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్‌యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
READ MORE: Vikram Misri: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది: విక్రమ్ మిస్రీ
కాగా.. మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో తెలిపింది. ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని సైన్యం పర్యవేక్షిస్తోందని మిస్రీ అన్నారు. పాకిస్థాన్ చర్యను ఆయన ఖండించారు. పాక్ దాడులను తిప్పికొట్టాలని, దాడులు ఆపడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మిస్రీ అన్నారు. ఎలాంటి ఆక్రమణలనైనా ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు.
