NTV Telugu Site icon

Pakistan: అమ్మాయిలకు కష్టాలు తెచ్చిపెట్టిన వర్షాకాలం..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Child Marriages

Child Marriages

Pakistan: పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు. సింధ్‌లో.. కుటుంబ పోషణ కోసం 14 ఏళ్ల షామిలా, ఆమె 13 ఏళ్ల సోదరి అమీనాకు వారి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. యుక్తవయసులో ఉన్న బాలికలకు పెళ్లి చేసేందుకు బదులుగా వారి తల్లిదండ్రులు డబ్బును పొందారు. దీంతో తమ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో పెరుగుతున్న బాల్య వివాహాల కేసులు హక్కుల సంఘాల ఆందోళనను పెంచాయి. నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో బాల్య వివాహాల కేసులు తగ్గుముఖం పట్టాయి, అయితే 2022 వినాశకరమైన వరదల తర్వాత బాల్య వివాహాల రేటు మళ్లీ పెరుగుతోంది. దేశంలో వ్యవసాయానికి ముఖ్యమైనదిగా భావించే రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా బాల్యవివాహాలు పెరిగిపోయాయి. వరదల వల్ల పంటలకు నష్టం వాటిల్లింది.

Read Also: Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

సింధ్‌లో బాల్య వివాహాల కేసుల పెరుగుదల
నివేదిక ప్రకారం, సింధ్‌లోని ఖాన్ మహ్మద్ మల్లా వంటి గ్రామాల్లో బాల్య వివాహాల కేసులు బాగా పెరిగాయి. 2022 వరదల కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ కుటుంబాలు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలకు వివాహం చేస్తున్నారు. ఆమె కోసం రెండు లక్షల పాకిస్థానీ రూపాయలు చెల్లించినట్లు షమీలా అత్తగారు బీబీ సచల్ తెలిపారు. ఈ ప్రాంతానికి ఇది భారీ మొత్తం. ఇక్కడ కుటుంబాలు రోజుకు దాదాపు రూ.80తో జీవిస్తున్నాయి. షమిలా లాంటి చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత మంచి జీవితం కోసం ఆశపడ్డారు, కానీ వారు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. 18 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న అమ్మాయిల సంఖ్యలో పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో వివాహానికి చట్టబద్ధమైన వయస్సు వివిధ ప్రాంతాలలో 16 నుండి 18 వరకు ఉంటుంది.