Site icon NTV Telugu

CM Revanth Reddy: MCR HRDIT ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Revanth

Revanth

CM Revanth Reddy: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం MCR HRDIT ని సందర్శించి, ఫాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎంతో పాటు.. మంత్రి సీతక్క పాల్గొన్నారు.

Read Also: Siddipet: గూగుల్ మ్యాప్ తెచ్చిన ముప్పు.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లిని డీసీఎం వ్యాన్

అంతకుముందు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి MCR HRDIT DG డాక్టర్ శశాంక్ గోయల్ పుస్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం.. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏడీజీ బెన్హర్ మహేష్ దూత్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, మాజీమంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: Parvathipuram: పాలకొండలో రెచ్చిపోయిన దొంగలు .. దిశా ఎస్సై ఇంట్లో చోరీ

Exit mobile version