Sri Raja Rajeshwara Swamy Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ నెల 20 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేములవాడ పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించనున్నారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు మంజూరు చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు, అలాగే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వేములవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.
Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..