NTV Telugu Site icon

CM Revanth: సీతారాం ఏచూరి మృతిపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి.. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

Read Also: Sitaram Yechury: బాల్యం మొత్తం హైదరాబాద్లోనే.. సీతారాం ఏచూరి జీవిత విశేషాలు

సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. సీపీఏం సీనియర్ నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగు బిడ్డగా ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీతారాం ఏచూరికి నివాళి అర్పిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Read Also: Harish Rao: అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు..