NTV Telugu Site icon

Godavari: గోదావరి నదికి సీఎం కేసీఆర్ ప్రత్యేక హారతి

Kcr Aarti

Kcr Aarti

Godavari River: ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో రెండు జిల్లాల సరిహద్దు గోదావరి నది చేరుకున్న అనంతరం కొద్ది సేపు ఆగి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు.

Read Also:CM KCR Speech: ధరణి పోతే దళారీ రాజ్యం.. అదంతా దాని వల్లే..

అనంతరం నదిలో నాణాలను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సుందిల్ల బ్యారేజ్ సమీపంలోనే గోదావరి వంతెన ఉండటం ఏడాది పొడుగున నీటి నిల్వ ఉంటుంది. దీంతో నది ప్రవాహానికి ముగ్ధుడైన ముఖ్యమంత్రి ప్రత్యేక హారతి నిర్వహించారు. ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు నియోజక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.

ఇదిలా ఉండగా.. మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.1000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4116 పింఛన్‌ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3,116 పింఛన్‌ వస్తోంది. దీంతో సభకు వచ్చిన ప్రజలు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు.

Read Also: Big Breaking: దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. పింఛన్‌ పెంపు

కొత్త జిల్లాల్లో చక్కటి కలెక్టరేట్లు నిర్మించుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారన్న ముఖ్యమంత్రి… జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో అవి క్రమంగా సాధించుకుంటున్నామన్నారు. తాగు, సాగు నీటి సరఫరాలో ఇవాళ తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్న ముఖ్యమంత్రి… ఉచిత విద్యుత్‌, నిరంతర విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు. విద్యుత్‌ తలసరి వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని సీఎం తెలిపారు. అలాగే వరి సాగులో పంజాబ్‌ను కూడా మించిపోయామన్న ఆయన.. యాసంగిలో దేశం మొత్తం కలిపి 94 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. యాసంగిలో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. ఇప్పటికీ భారత్‌ వంట నూనెను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. వంట నూనె దిగుమతి తగ్గించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.