NTV Telugu Site icon

AP Assembly: రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.

శాసన సభలో ప్రశ్నోత్తరాలు
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ , ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖపట్టణం లో ని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులపై ప్రశ్నలు-మంత్రుల సమాధానాలు

శాసన సభలో ప్రశ్నోత్తరాలు
ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిడ్కో గృహాలు, సుప్రీం కోర్టులో కేసులు ,ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మల్లింపు, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులపై ప్రశ్నలు – మంత్రులు సమాధానం

Read Also: Weather Warning: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

శాసనమండలిలో నేడు
శాసనమండలిలో గత 5ఏళ్ల పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేయనున్నారు.
శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రైవేటు ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్‌ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఇ -వ్యర్థాల తొలగింపు, 2023 – 2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల భీమా బకాయిల చెల్లింపుపై ప్రశ్నలు- మంత్రుల సమాధానం
శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు
రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, రాష్ట్రంలో నూతన విద్య కళాశాలలు, పులివెందుల గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రశ్నలు- మంత్రుల సమాధానం

Show comments