NTV Telugu Site icon

One Rupee Biryani: రూపాయి బిర్యానీ కోసం పోతే.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

1 Rupee Biryani

1 Rupee Biryani

కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే బిర్యానీ అని ప్రచారం చేసింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉందండొయ్. అదే ఒక రూపాయి అంటే రూపాయి కాయిన్ కాదు.. రూపాయి నోటు.. రూపాయి నోటు ఉంటే.. బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఒక్క రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో ప్రచారం చేశారు.

Also Read: BSNL: బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులపై 25 చోట్ల సిబిఐ దాడులు

అయితే.. ఆ నోట్లను సేకరించి మరీ హోటల్ కు ప్రజలు క్యూ కట్టారు.. ఆఫర్‌ మద్యాహ్నం 2.30 గంటల తరువాత అని హోటల్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ జనం మాత్రం అంతకు ముందు నుంచే హోటల్ దగ్గర బిర్యానీ కోసం బారులు తీరారు. క్యూ కట్టిన జనం చాలా సేపు క్యూలో నిల్చోచి సహనం కోల్పోయిన హోటల్‌లోకి చొరబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read: Mira Road : సరస్వతి హత్య కేసులో సంచలన విషయాలు.. మనోజ్‎కు ఎయిడ్స్

ఆ హోటల్ ఏరియాలో వందలాది వెహికిల్స్ పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టి.. హోటల్ ​ను తాత్కాలికంగా క్లోస్ చేయించారు. హోటల్​ ప్రారంభోత్సవం రోజే అందరికి తెలియాలన్న కోరిక నెరవేరినప్పటికి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ యజమాని అన్నారు. బిర్యానీ కోసం వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. అయితే అక్కడ నో పార్కింగ్ ​లో పార్కింగ్ చేసిన వెహికిల్స్ కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.