Strange Love Story: ఆమెకు ఇద్దరు, అతడికి నలుగురు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strange Love Story: వారిద్దరికీ విడివిడిగా వివాహాలయ్యాయి. చుట్టాలు కావడం వల్ల తరచూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ సమస్యను పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ వింత ఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది. జీవన్‌లాల్ పానికా అనే వ్యక్తి తన కుటంబంతో కలిసి మార్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్చేది అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య ఫూల్కున్వర్తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. అతడి బంధువులైన రాజేంద్ర ప్రసాద్ పానికా భార్య రాఖీ పూరితో పాటు పెంద్రా అనే గ్రామంలో నివసిస్తున్నాడు. తరచూ జీవన్‌లాల్, రాజేంద్ర ప్రసాద్ కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్తుండేవి.
ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ భార్య రాఖీ పూరి, జీవన్‌లాల్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో అదును చూసుకుని వారిద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆరు రోజుల తర్వాత రాఖీపూరి బంధువులు జీవన్‌లాల్ ఇంటికి వెళ్లారు. వీరందరినీ రాజేంద్రప్రసాద్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి జీవన్‌లాల్ జంట తిరిగి వచ్చింది. రాఖీ పూరి భర్త రాజేంద్రప్రసాద్, జీవన్ లాల్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. వారు పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్నారు. మరోవైపు తనకు భర్త వద్దకు వెళ్లాలని లేదని.. అతను తనను వేధిస్తున్నాడని రాఖీ పూరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు, తమపై దాడి చేశాడని జీవన్ లాల్ తల్లి రాజేంద్ర ప్రసాద్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Cylinder Blast: పెళ్లి వేడుకల్లో అపశ్రుతి.. సిలిండర్ పేలి 5గురు మృతి, 60 మందికి గాయాలు
తన లవర్ జీవన్‌లాల్ లేకుండా తాను బతకలేనని రాఖీ పూరి చెప్పింది. కాగా తన భార్య రాఖీ పూరి లేకుండా తాను బతకలేనని రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. మరో వైపు తన భర్త మరో మహిళను తీసుకొచ్చినా తనకు ఏం అభ్యంతరం లేదని.. తనతో నేను సంతోషంగా ఉంటానని జీవన్ లాల్ భార్య అంటోంది. ఈ వింత లవ్‌స్టోరీని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు జట్టు పీక్కుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!