NTV Telugu Site icon

Strange Love Story: ఆమెకు ఇద్దరు, అతడికి నలుగురు.. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు

Strange Love Story

Strange Love Story

Strange Love Story: వారిద్దరికీ విడివిడిగా వివాహాలయ్యాయి. చుట్టాలు కావడం వల్ల తరచూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ సమస్యను పరిష్కరించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ వింత ఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది. జీవన్‌లాల్ పానికా అనే వ్యక్తి తన కుటంబంతో కలిసి మార్వాయి పోలీస్​ స్టేషన్ పరిధిలోని చార్​చేది అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య ఫూల్​కున్వర్​తో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. అతడి బంధువులైన రాజేంద్ర ప్రసాద్ పానికా​ భార్య రాఖీ పూరితో పాటు పెంద్రా అనే గ్రామంలో నివసిస్తున్నాడు. తరచూ జీవన్​లాల్​, రాజేంద్ర ప్రసాద్​ కుటుంబాలు ఒకరింటికి ఒకరు వెళ్తుండేవి.

ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ భార్య రాఖీ పూరి, జీవన్‌లాల్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో అదును చూసుకుని వారిద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆరు రోజుల తర్వాత రాఖీపూరి బంధువులు జీవన్‌లాల్ ఇంటికి వెళ్లారు. వీరందరినీ రాజేంద్రప్రసాద్‌ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి జీవన్‌లాల్ జంట తిరిగి వచ్చింది. రాఖీ పూరి భర్త రాజేంద్రప్రసాద్‌, జీవన్‌ లాల్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. వారు పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్నారు. మరోవైపు తనకు భర్త వద్దకు వెళ్లాలని లేదని.. అతను తనను వేధిస్తున్నాడని రాఖీ పూరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు, తమపై దాడి చేశాడని జీవన్​ లాల్​ తల్లి రాజేంద్ర ప్రసాద్‌పై పోలీస్​ స్టేషన్‌లో కేసు పెట్టింది.

Cylinder Blast: పెళ్లి వేడుకల్లో అపశ్రుతి.. సిలిండర్ పేలి 5గురు మృతి, 60 మందికి గాయాలు

తన లవర్‌ జీవన్‌లాల్‌ లేకుండా తాను బతకలేనని రాఖీ పూరి చెప్పింది. కాగా తన భార్య రాఖీ పూరి లేకుండా తాను బతకలేనని రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. మరో వైపు తన భర్త మరో మహిళను తీసుకొచ్చినా తనకు ఏం అభ్యంతరం లేదని.. తనతో నేను సంతోషంగా ఉంటానని జీవన్‌ లాల్ భార్య అంటోంది. ఈ వింత లవ్‌స్టోరీని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు జట్టు పీక్కుంటున్నారు.