Chhattisgarh Assembly Election : ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌లో అసెంబ్లీ ఎన్నికల విధుల నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు మంగళవారం ఓటింగ్ అనంతరం అర్థరాత్రి ఈవీఎంలను సేకరించి ఇంటికి తిరిగి వస్తున్నారు. కేష్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు నిర్ధారించారు.
Read Also:Harish Rao: కొండగట్టుకు హరీశ్ రావు.. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం తొలి దశలో పోలింగ్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొండగావ్ జిల్లా కేంద్రంలో ఈవీఎంలను నిక్షిప్తం చేసేందుకు చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు సేకరించే వరకు లాకర్ రూమ్‌లోనే ఉన్నారు. వీరిలో ప్రిసైడింగ్ అధికారులు శివ నేతమ్, సంత్రమ్ నేతమ్, ఒరై నివాసితులు హరేంద్ర ఉన్నారు. అర్ధరాత్రి తర్వాత ఈ ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు SUVలో ఒరాయ్ గ్రామానికి బయలుదేరారు. అయితే వారి కారు బహిగావ్ సమీపంలోకి చేరుకోగానే వారిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వాహనంలో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా వైద్యులు చూసే సరికి మృతి చెందినట్లు ప్రకటించారు.
Read Also:Jammu and Kashmir: కశ్మీర్ పోలీసులు, ఆర్మీ జాయింట్ ఆపరేషన్.. టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతం..
ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ట్రక్కును అదుపులోకి తీసుకున్నట్లు కేశ్‌కల్ పోలీస్ స్టేషన్‌లో తెలిపారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్ నవంబర్ 17న జరగనుంది. తొలి దశలో 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 76.26 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.