ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
READ MORE: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
కేసు గురించి పూర్తి వివరాలు..
అక్టోబర్ 18, 2018న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్‌లోని నిర్జన ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితులు నితిన్ యాదవ్, నీలకంఠం గణేష్ లను 2018 అక్టోబర్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.. నితిన్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడు. బాలికను కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు తెలిపాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక మృతదేహంపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీరిని ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టారు.
READ MORE: Canada: భారత్‌తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?
ఇందులో ప్రధాన నిందితుడైన నితిన్ యాదవ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. సాక్ష్యాలను దొరక్కుండా చేసినందుకు నీలకంఠం నగేష్‌కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెలువరించింది. బాలిక చనిపోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి నీలకంఠం నగేష్ ను మాత్రం అత్యాచారం కేసును పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. దీంతో బాధిత తల్లి ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. శవంపై అఘాయిత్యానికి పాల్పడటం నేరం కాదని చెప్పింది.