ఇటీవల దంతెవాడ జిల్లా అరన్పూర్ మందుపాతర పేలుడు ఘటనపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెడ్కా చౌక్ సమీపంలో జరిగిన ఈ బ్లాస్టింగ్ ఘటనలో భాగస్వామ్యం ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు దంతెవాడ జిల్లా పోలీసులు. ఈ ఘటనపై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెళ్తే… ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లా అరన్పూర్ సమీపంలోని పెడ్కా చౌక్ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంగతి తెలిసిందే.
Also Read : Dhanush: అనుష్క సినిమాలో ధనుష్.. ఇది అస్సలు ఊహించలేదే
పోలీసు బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేయడంతో 10మంది డీఆర్జీ జవాన్లు, ఒక డ్రైవర్ చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు దర్భా ఏరియా మలంగీర్ ఏరియా కమివటీ మిలీషియా సభ్యులు బుద్ర మార్వి, జితేంద్ర ముచకిచ హిద్మా మార్కం, హిద్మా మార్విలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా వీరికి కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టు దంతెవాడ ఎస్సీ సిద్దార్థ్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read : Hanuman Chalisa : కాంగ్రెస్ మేనిఫెస్టోకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా