Dhanush: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా.. అనుష్క చెఫ్ గా నటిస్తోంది. అసలు ఈ కాంబో అంటేనే హైప్ వీర లెవెల్ లో హైప్ వచ్చింది. దీనికి తోడుమరింత హైప్ పెంచే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రంగంలోకి దిగాడట. ధనుష్ హీరోగానే కాదు సింగర్ గా కూడా ఫేమస్ అన్న విషయం అందరికి తెల్సిందే.
Chiranjeevi : ఏంటీ .. ఇంకో రీమేకా.. అన్నా నీకు దండం పెడతామే..?
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్.. మిస్ హెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఒక సాంగ్ పాడబోతున్నాడట. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ధనుషే పాడనున్నాడట. ఇప్పటివరకు ధనుష్ పాడిన ప్రతి పాట ఒక చార్ట్ బస్టర్.. ఇప్పుడు ఈ సినిమా కోసం ధనుష్ పాట పాడుతున్నాడు అంటే అది కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. అనుష్క కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నవీన్ సైతం జాతిరత్నాలు తరువాత వెండితెరపై కనిపించలేదు. దీంతో ఈ సినిమా కోసం అందరు అభిమానులు వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వార్త కూడా నిజమైతే.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. మరి త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.