Site icon NTV Telugu

Chevireddy Mohith Reddy: తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి మోహిత్ రెడ్డి రాజీనామా!

Mohith Reddy

Mohith Reddy

Chevireddy Mohith Reddy: చిన్న వయసులో తుడా ఛైర్మన్ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో కష్టపడి ప్రజలకు సేవలు అందించామన్నారు.

Read Also: Ramoji Rao: రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి.. రేపు, ఎల్లుండి సంతాప దినాలు

గత ఐదేళ్లు అభివృద్ధిలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది పనులు చేశామన్నారు. మా శక్తి వంచన లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశామన్నారు. గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లామన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు. మా పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, రుణ పడి ఉంటామన్నారు. లక్ష ఓట్లు వేసిన మా నియోజకవర్గం ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నానికి శుభాకాంక్షలు తెలిపారు. మేము గెలుపు ఓటమి వచ్చినా ఒకేలా ఉన్నామని.. ప్రజలకు అండగా నిలుస్తానని, వచ్చే ఎన్నికల్లో మీ అందరి సహకారంతో గెలుస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version