Site icon NTV Telugu

Chevireddy: ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి హల్ చల్.. వాళ్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక..!

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని చెప్పారు. రాజకీయ పరంగా అక్రమ కేసులు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని..సిట్ తప్పు మీద తప్పు చేస్తోందన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

READ MORE: South Central Railways : తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..

గతంలో కూడా కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు. కాగా.. లిక్క స్కాం కేసులో ఆయన ఏ38గా చేర్చిన విషయం తెలిసిందే.

READ MORE: Pakistan-US: పాక్ కొత్త స్కెచ్.. అమెరికా సహా పలు దేశాలతో బిజినెస్ ప్లాన్

Exit mobile version