పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. కానీ ఇప్పటివరకు ఆ డబ్బులు విడుదల చేయలేదని.. అది కోర్టులో నడుస్తున్న వ్యవహారం, ఆ డబ్బుకు ఆధారాలు అన్ని ఉన్నాయని తెలిపారు. తాను ప్రభుత్వ విప్ గా ఉన్నప్పుడు గిరి అని తన గన్ మ్యాన్ గా ఉండేవారని.. ఇప్పుడు గన్ మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు దొరికింది నాది అని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారన్నారు.
READ MORE: Kailash Vijayvargiya: “చిన్న దుస్తులు వేసుకున్న అమ్మాయిలు నచ్చరు” మళ్లీ వివాదాల్లో బీజేపీ మంత్రి..!
రూ. 200 నుంచి 500 కోట్లు డబ్బు తాను తరలిస్తున్నారని చెప్పమంటున్నారని.. కానిస్టేబుల్ గిరి ని బెదిరించి రాయించుకొని తనపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కానిస్టేబుల్ గిరిని ఐదు రోజులు టార్చర్ పెట్టారని.. మా పీఏలను, డ్రైవర్లను, గన్ మ్యాన్ లను తీసుకొని వెళ్లి తనపై కుట్ర చేయడానికి ప్రయత్నిస్తూన్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. “నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పండి, నేనే వచ్చి లొంగిపోత. న్యాయస్థానాల్లో నిజానిజాలు అన్ని బయటకు వస్తాయి. రేపు ఇదే కేసుల్లో మీరు జైలుకు పోతారు. నా కొడుకును బెంగళూరులో అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని వెళ్తే, నాపై ఫోక్సో కేసు పెట్టారు. నన్ను, నా కొడుకుపై అక్రమ కేసుల్లో ఇరికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
లిక్కర్ కేసులో నన్ను చేర్చాలని చూస్తున్నారు. మద్యం వల్ల నా ఇంట్లో ఇద్దరు చనిపోయారు, మద్యంకి నేను ఎప్పటికీ దూరం. నన్ను అరెస్ట్ చేయడానికి బెటాలియన్లు అవసరం లేదు, రమ్మంటే నేను వస్తాను.” అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Kakani Govardhan Reddy: పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..!
