ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఇవాళ (శుక్రవారం) కొంగర కలాన్ లోని పీఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకెళ్తానన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభివృద్దిని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఆయన అసలు ఎవరికి అందుబాటు ఉండరని తెలిపారు. మహిళలు, యువకులు, రైతాంగం కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తుక్కుగూడ జన జాతర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మోగించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన 30 రోజులు కష్టపడితే చేవెళ్ల పార్లమెంట్ ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తానన్నారు.
Read Also: Chiranjeevi: తేజ సజ్జ చేశాడు.. ఇక నేను చేయనక్కర్లేదు..చిరు ఆసక్తికర వ్యాఖ్య లు
కాగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి వివాదరహితుడని చెప్పారు. ఇక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజలలో లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కేఎల్ఆర్, సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున కదనం చేసేది బూతు స్థాయి కార్యకర్తలే… ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే… మీ కష్టం, మీ పోరాటం అనివార్యం.
అందుకే మిమ్మల్ని కలిసి… గెలుపు ఆవశ్యకత వివరించేందుకే ఈ సమావేశం.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి… pic.twitter.com/aNFq1QgFK7
— Dr Ranjith Reddy (@DrRanjithReddy) April 12, 2024