వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా లాభ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న నిధులను మొత్తం తినేసింది అని ఆయన ఆరోపించారు. అసాధ్యమైన పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ మాత్రమే అని కొండా విశ్వేశర్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Akhil 6: అయ్యగారు దిగుతున్నాడు.. గెట్ రెడీ
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు అని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశర్ రెడ్డి అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకలేక ఇతర పార్టీ నుంచి అభ్యర్థిని తెచ్చుకున్నారని ఆరోపించారు. మంఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీ బయట నుంచి తెచ్చుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సీటు మోడీదేనని రాసి పెట్టు కోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 12, 13 ఎంపీ సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.