NTV Telugu Site icon

Cheteshwar Pujara: విదేశీ గడ్డపై సెంచరీ.. మళ్లీ జట్టులోకి వస్తానంటున్న సీనియర్ ప్లేయర్

Pujara

Pujara

టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌ లో కౌంటీ క్రికెట్‌లో అతను రాయల్ లండన్ వన్డే కప్ లో ససెక్స్ తరుపున ఆడుతున్నాడు. 319 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు పుజారా.. దీంతో ససెక్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం విశేషం. అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎక్కడాడిన వంద శాతం ఎఫర్ట్‌ పెడతాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. టీమిండియా మరో మూడు నెలల పాటు టెస్టులు ఆడే అవకాశం లేదు. మళ్లీ డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ ఉంది. అప్పటి వరకు తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే’ అని పుజారా తెలిపాడు.

Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం

ఈసారి జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత టీమిండియాలో పూజారా కోల్పోయాడు. ఎందుకంటే పేలవ ప్రదర్శన చూపించడంతో.. అతన్ని వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో మళ్లీ టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు పుజారా కౌంటీలను వేదికగా ఎంచుకున్నాడు. గతంలోనూ ఓ సారి టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన సమయంలో ఇంగ్లండ్‌ కౌంటీల్లో అదరగొట్టి టీమిండియాలోకి పునారగమనం చేశాడు. అయితే మళ్లీ అదే దారిలోనే నడుస్తున్నాడు. మరోవైపు టీమిండియాలో యువ క్రికెటర్ల హవా పెరిగిపోవడంతో పుజారా, రహానే లాంటి సీనియర్‌లకు కాలం చెల్లిన పరిస్థితి కనిపిస్తోంది. పైగా వాళ్లు కూడా పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో పుజారా కౌంటీల్లో అదురగొడుతూ.. మళ్లీ టీమ్‌లోకి రావడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని టీమిండియా సెలెక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. మరి పుజారా తిరిగి టీమిండియాలోకి వస్తాడా అనేది వేచి చూడాలి.