Ganja In Metro: బరితెగించారు.. ఏకంగా మెట్రోలోనే గంజాయి తాగుతున్న వ్యక్తి..

  • చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్.
  • తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్.
  • నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
Ganja In Metro

Ganja In Metro

Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స్నాక్స్ తీసుకోవడం నిషేధం. అయితే తొండియార్‌ లోని భువనేష్ మెట్రోలో చాలా మంది ప్రయాణికుల మధ్య గంజాయి తాగాడు. అతడు గంజాయి తాగుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ విషయంలో వైరల్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డి. జయకుమార్ డిమాండ్ చేశారు.

MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్‭గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..

దాంతో వెంటనే అలెర్ట్ అయిన తేనాంపేట పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. నిందితుడి కదలికలను గమనించిన పోలీసులు అతడు తొండియార్‌ పేట నుంచి తేనాం పేటకు వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దాంతో అతి తక్కవ సమయంలో నిందితుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తేనాంపేట ఇన్‌స్పెక్టర్ సెంథిల్ మురుగన్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..