NTV Telugu Site icon

IPL Auction 2024: కివీస్ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిన చెన్నై ఫ్రాంఛైజీ..

Kiwis

Kiwis

దుబాయ్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్లో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యం కివీస్ స్టార్ ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకుంది. వేలంపాటలో న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఈ క్రమంలో చివరకు చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్‌ను 14 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 1 కోటి, అయితే అతను 14 రెట్లు ఎక్కువకు కొనుగోలు చేశారు. ముందుగా మిచెల్‌ కోసం ఢిల్లీ, పంజాబ్‌లు వేలం వేయగా.. ధర పెరగడంతో ఢిల్లీ జట్టు వెనుదిరిగింది. ఈ క్రమంలో చెన్నై మిచెల్ ను కొనుగోలు చేసింది.

Read Also: MLC Jeevan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరి తీయాలి..

కాగా.. కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను కూడా సీఎస్కే కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లు చెల్లించి రచిన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో రచిన్ జట్టు తరుఫున స్టార్ ఆటగాడిగా నిలిచాడు. అతను టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరర్‌గా నాల్గొవ స్థానంలో నిలిచాడు. తన బేస్ ధరను రూ.50 లక్షలు ఉండగా.. బేస్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను చేర్చుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న శార్దూల్ ఠాకూర్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకుముందు.. శార్దూల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరుఫున ఆడాడు.

Read Also: Nizamabad: సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..