తుఫాన్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని వైసీపీ మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదన్నారు. నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా? అని వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాట్లాడారు.
Also Read: Jr NTR New Look: మీసం తిప్పిన ఎన్టీఆర్.. టైగర్ కేక పెట్టించేలా ఉన్నాడుగా!
‘సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. రైతులకు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇస్తా అంటే వైర్లపై బట్టలు అరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. మూడు పంటలు పండే భూమిని రాజధానికి ఎంపిక చేసినప్పుడే ఆయన రైతు వ్యతిరేకి అని అర్ధం అవుతుంది. తుఫాన్ వల్ల రైతులు నష్టపోయారు. వైఎస్ జగన్ రైతులకు చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. రైతుల కోసం రైతు భరోసా, ఆర్బీకేలు తీసుకువచ్చారు. చంద్రబాబు రైతుల పట్ల బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నా చర్యలు తీసుకోలేదు. రైతుల నష్టానికి చంద్రబాబు కారణం అయ్యారు. తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్ చేయడంలో రాజకీయం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా విదేశీ పర్యటనకు చంద్రబాబు వెళ్ళారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ వుందా.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా?’ అని చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రశ్నించారు.
