తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్, జిల్లా అటవీశాఖ అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా నదిపై హై లెవెల్…
తుఫాన్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని వైసీపీ మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదన్నారు. నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా? అని వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల…