Site icon NTV Telugu

Chelluboina venugopal Krishna: మహానాడులో జగన్‌పై ధన్యవాద తీర్మానం చేయాలి.. ఎందుకంటే..?

Venugopal Krishna

Venugopal Krishna

Chelluboina venugopal Krishna: ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది తెలుగు దేశం పార్టీ.. అయితే, మహానాడులో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేవారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు ఓ మోసం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు నాయుడు చెరిపేశారని, ఎన్టీఆర్ పేరుతో ఓ జిల్లాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకు మహానాడులో సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, పుష్కరాల్లో 29 మంది మరణాలకు పశ్చాత్తాపం పడుతూ మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ కూడా చేశారు.. నాడు ఏన్టీఆర్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోతే.. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోయారని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Read Also: MLA Vivekananda: కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు

Exit mobile version