NTV Telugu Site icon

Cheddi Gang: అలర్ట్.. వరంగల్‌కి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ.. ఆ ప్రాంతంలో దొంగతనం..

Cheddi Gang

Cheddi Gang

హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్ళారనేది ఆరాతీస్తున్నారు.

READ MORE: CM Chandrababu: నేడు చెన్నైకు ఏపీ సీఎం చంద్రబాబు..

వీరు అల్లాటప్పా గ్యాంగ్ కాదండోయ్ వీరందరి బ్యాచ్ ఒక్కటే డ్రస్సింగ్ కోడ్ యూస్ చేస్తారు. అదే చడ్డీ. ఏదైనా ఇంటికి తాళం ఉంటే చాలు చెడ్డీ వేసుకుని దుప్పట్లు, మెఖానికి మాస్క్ వేసుకుని దోచుకోవడమే. సినిమాలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పినట్లు దొంగతనాలు చేస్తే.. ఇక్కడ మాత్రం చెడ్డీలు వేసుకుని ఇంట్లో చొరబడి ఐడియాలతో ఎవరికి కనిపించకుండా బయటకు సొమ్ము దోచుకుని పరారవుతారు. ఇది ఇప్పటి రోజుల్లో మొదలైంది కాదండోయ్.. చెడ్డీ గ్యాంగ్ 1987 నుంచే ఉందంటే ఆశ్చర్య పోనవసరం లేదు. 1999 వరకు కూడా పోలీసులు వీరిని కళ్లు గప్పి ఎంత చాకచక్యంగా చేసారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజలు భయభ్రాంతులు లోనయ్యారు. కొద్ది రోజులు చెడ్డీ గ్యాంగ్ అంటే హల్ చల్ చేసిన వీరు.. ఇప్పుడు మళ్లీ దొంగ తనానికి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉన్న చెడ్డీ గ్యాంగ్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ సందడి చేసింది.