NTV Telugu Site icon

Cheater Arrest: బ్యాంకుల వద్ద అమాయక మహిళలే టార్గెట్‌.. మోసగాడు అరెస్ట్

Cheater Arrest

Cheater Arrest

Cheater Arrest: తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ పలు మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. బ్యాంకులలో డబ్బులు కట్టడానికి వచ్చిన అమాయక ఆడవారిని పరిచయం చేసుకుని తాను సదరు బ్యాంకులో పని చేస్తానని వారిని నమ్మించేవాడు. వారు బ్యాంకులో కట్టడానికి తెచ్చిన డబ్బు తీసుకుని కట్టకుండా వారికి దొంగ రసీదు ఇచ్చి డబ్బులను తీసుకుని వెళ్ళిపోయేవాడు.

Also Read: Amit Shah : మిషన్ కాకతీయలో 22వేల కోట్ల కుంభకోణం జరిగింది

తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో గ్రామాలు వార్డులలో తిరుగుతూ, అమాయక ఆడవారిని ఎంచుకుని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తాను మునిసిపాలిటీ ఆఫీస్ నందు పనిచేస్తానని నమ్మించేవాడు ఆ మోసగాడు. ప్రభుత్వం వారు ఇచ్చే TOLD ఇళ్ళను తక్కువ రేటుకు ఇప్పిస్తానని, దానికి ఖర్చు అవుతుందని నమ్మించి వారి వద్ద డబ్బు తీసుకుని వారికి ఇళ్ళు ఇప్పించకుండా పరారయ్యేవాడు. కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన షేక్ నాగూర్ మీనావలె అలియాస్ నాగూర్ అభిరాంరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సదరు ముద్దాయిని రిమాండ్‌కు పంపారు పోలీసులు. నిందితుడిపై ఇంతకుముందు సుమారు 13 ఏళ్ల నుంచి ఇలాంటి కేసులు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణ జిల్లా, ఉభయగోదావరి జిల్లాలలో నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా నేరాలు చేయడం మాత్రం మానలేదు. పలు కేసులో విచారణ దశలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు.