Mercedes-Benz EQA: భారత కార్ల మార్కెట్ శరవేగంగా ఎలక్ట్రిక్ వైపు పరుగులు పెడుతుంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఈవీ రంగంలో తమ పట్టును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారుగా Mercedes Benz EQAని విడుదల చేసింది. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. EQA Mercedes-Benz భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌లో EQB, EQE SUV, EQS సెడాన్ లలో చేరింది. ఇది భారతీయ మార్కెట్లో కంపెనీ నుండి నాల్గవ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. అన్ని ఇతర మోడల్స్ దీని కంటే ఖరీదైనవి. ఇప్పటికే కంపెనీ తన అధికారిక బుకింగ్ ను కూడా ప్రారంభించింది. అయితే దీని డెలివరీ జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది.
Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ తర్వాత.. అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!
ఈ కార్ కు సంబంధించి పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో కలర్ ఆప్షన్ లలో ఈ SUVని మొత్తం 7 రంగుల్లో కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఇక Mercedes-Benz EQA క్యాబిన్ లగ్జరీ, అధునాతన ఫీచర్లతో రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క డ్యాష్ బోర్డ్ లో బ్లాక్ లైట్ స్టార్ ప్యాటర్న్ ఇవ్వబడింది. మీరు S క్లాస్ సెడాన్ లో చూడవచ్చు. ఇది కాకుండా, అప్హోల్స్టరీ తోపాటు ఎయిర్ వెంట్లపై రోజ్ టైటానియం గ్రే పెర్ల్ లాంటి వాటితో కొంచెం ఎక్కువ ప్రీమియం రూపాన్ని తీసుకరానున్నాయి. ఇది కాకుండా కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉంది.
Samsung Galaxy Watch Ultra : కాస్ట్లి వాచ్ను విడుదల చేసిన శాంసంగ్.. ఫీచర్లు మాములుగా లేవుగా..
ఇక ఈ కారులో కంపెనీ 70.5kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ను అందించింది. ఇది ముందు మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానించబడి ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 190hp పవర్, 385Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 8.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ కారు ఒకే ఛార్జ్‌లో 560 కి.మీ.ల డ్రైవింగ్ పరిధిని ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. దీని బ్యాటరీ 100kW కెపాసిటీ గల DC ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌కు మద్దతు ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ తో దాని బ్యాటరీని కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 11kW AC వాల్ ఛార్జర్ తో ఈ కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల 15 నిమిషాలు పడుతుంది.