దొంగలు తమ ప్రతాపం చూపారు. ఎవరైతే మాకేంటి అన్నట్టుగా అంతర్జాతీయంగా పేరున్న చెగువేరా కూతురికి షాకిచ్చారు దొంగలు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో క్యూబా విప్లవ వీరుడు కుమార్తె అలైదా గువెరాకు చేదు అనుభవం ఎదురైంది. చెగువేరా కూతురు అలైదాకు బహుకరించిన చెగువేరా ఫోటో చోరీకి గురికావడం కలకలం రేపింది. విజయవాడ క్యూబా సంఘీభావ సభలో ఘటన చోటుచేసుకుంది.
Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
ప్రముఖ ఆర్టిస్ట్ గిరిధర్ చే గువేరా ఫోటో వేసి బహుకరణ చేశారు. ఆ ఫోటోని అందుకుని చెగువేరా కూతురు అలైదా ఆనందానికి గురయ్యారు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. చెగువేరా ఫోటో బహుకరించిన కాసేపటికి వేదిక పైనే చోరీకి గురైంది. దొరికితే తనకు పోస్ట్ చేయాల్సిందిగా నిర్వహకులను కోరింది అలైదా గువేరా. విజమవాడలో ఇలాంటి ఘటన జరగడం పట్ల చెగువేరా అభిమానులు షాకయ్యారు.
Read Also: Bride Cancels Marriage: వరుడికి అది రాదని పెళ్లికి నిరాకరించిన యువతి