Chava Movie : ‘ఛవా’ షూటింగ్ కంప్లీట్..మహారాణిగా రష్మిక మందన్న…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు యూత్ లో క్రేజ్ ఉంది.. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో అమ్మడు కు డిమాండ్ కూడా పెరిగింది. గ్లామరస్ రోల్‌తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది..
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛవా’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసింది.రష్మిక మందన్న 22 వ చిత్రంగా ఈ సినిమా రూపొందింది.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూట్ పూర్తయిన సందర్భం గా మూవీ టీమ్‌పై ప్రేమను కురిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Also Read
ఆ పోస్ట్ లో.. డైరెక్టర్ లక్ష్మణ్, ప్రొడ్యూసర్ దినేష్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, విక్కీ కౌశల్ రత్నం లాం టి వాడని చెప్పింది. ఇదొక పీరియాడికల్ డ్రామా. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్దకుమారుడు ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా, శంభాజీ భార్య ఏసుభాయ్ భోంసాలే పాత్రలో రష్మిక కనిపించనుంది. రాజ్య పాలనలో సింహాభాగపు వ్యవహారాలన్నీ చక్కదిద్దే ఏసుభాయ్‌కి ఛత్రపతి మహారాణి అని పేరు ఉంది.. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటించడం చాలా హ్యాపిగా ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.. ఇక తెలుగులో ఆమె సినిమాల విషయానికొస్తే.. పుష్ప2, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో రష్మిక నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..