NTV Telugu Site icon

ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..

Chatgpt

Chatgpt

ప్రస్తుతం చాట్ జీపీటీ పెద్ద ఎత్తున ప్రజాదరణను సొంతం చేసుకుంది. చాట్ జీపీటీ భాష ఆధారంగా ఒక మోడల్.. దానిపై ఏదైనా అడగండి.. అది మీతో సేమ్ మనిషిలా మాట్లాడనుంది. దాంతో మాట్లాడితే మీరు రోబోతో మాట్లాడుతున్నట్లు అనిపించదు.. నిజంగా మనిషితోనే మాట్లాడుతున్న అనుభుతి కల్గుతుంది. ఈ కృత్రిమ మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. జీపీటీ అనేది AI చాట్ బాట్ లాంటిది. ఇది ఆన్‌లైన్ కస్టమర్ కేర్ కోసం రూపొందించారు. బహుళ భాషలను ఏకకాలంలో అర్థం చేసుకునే ప్రక్రియను అర్థం చేసుకునే విధంగా ఇది ఇప్పటికే ట్రైనింగ్ పొందింది.

Read Also: Alex Carey: కటింగ్ షాపులో డబ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీపర్.. డెడ్లైన్ విధించిన ఓనర్..!

గత సంవత్సరం నవంబర్‌లో ఓపెన్ ఏఐ.. చాట్ జీపీటీని స్టార్ట్ చేసింది. కేవలం ఒక వారంలో, చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇది అనేక ఉత్పత్తులు.. సేవలలో విలీనం చేయబడింది. ప్రస్తుతం చాట్‌బాట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఏమిటంటే.. అది ఇప్పుడు మీకు లోకల్ భాషల్లో కూడా ఆన్సర్ ఇవ్వగలదు. మీ ప్రాంతీయ భాషలో ప్రశ్నలకు సమాధానాలు తెలుపనుంది. ప్రస్తుతం.. చాట్ జీపీటీ కొన్ని స్థానిక భాషలకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది.

Read Also: Pakistan: వ్యాన్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్, ఏడుగురు దుర్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం

ముందుగా జీపీటీ చాట్‌కి లాగిన్ కావాలి.. ఇది మీకు మొదటిసారి అయితే.. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.. సెర్చ్ బార్‌లో మీ ప్రశ్నను హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ లో టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే, చాట్‌బాట్ మీకు స్థానిక భాషలో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము నిజంగా చెక్ ఇన్ చేసినప్పుడు, చాట్‌బాట్ హిందీ, బెంగాలీలో రియాక్ట్ అయింది. త్వరలో ఇతర స్థానిక భాషల్లో కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వనుందని దాని నిర్వహకులు తెలిపారు.

Read Also: Akbaruddin Owaisi: నన్ను చంపాలని చూసిన వారిని క్షమిస్తున్నా: ఓవైసీ హాట్ కామెంట్స్

అయితే.. జీపీటీ-3.5 మోడల్ ఇప్పటి వరకు 2021 వరకు మాత్రమే డేటాను అందిస్తుంది. ఓపెన్ AI iOS కోసం చాట్ జీపీటీ యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది ప్రారంభంలో అమెరికాలో ప్రారంభించబడి.. క్రమంగా అన్ని దేశాలకు విస్తరించబడింది. ఈ యాప్ భారతదేశంలోని iOS వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఆండ్రాయిడ్ కోసం కంపెనీ ఇంకా అప్లికేషన్‌ రిలీజ్ కాలేదు. ప్రసెంట్ చాట్ జీపీటీని యాక్సెస్ చేయడానికి వెబ్‌పై ఆధారపడవలసి ఉండటంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు దీని కోసం ఇంట్రెట్ గా ఎదురు చూస్తున్నారు.