Chandrayaan-3: చందమామపై దిగిన చంద్రయాన్-3.. ఇస్రోకు పంపిన తొలి మెసేజ్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దృక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత ఇస్రోకు తొలి మెసేజ్‌ను పంపింది.
జాబిలమ్మపై అడుగుపెట్టిన తర్వాత చంద్రయాన్-3 నుంచి ఇస్రోకు చేరిన తొలి మెసేజ్ ఏంటి అంటే.. ”నేను నా గమ్యాన్ని చేరుకున్నా.. మీరు (భారత్, ఇస్రో) కూడా”.. అంటూ మెసేజ్‌ను పంపింది. ఇక, దీనిని ఇస్రో ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది.. భారతదేశానికి అభినందనలు అంటూ ట్వీట్ చేసింది.. మరోవైపు.. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ.. ఈ విజయంతో నా జీవితం ధన్యమైంది అన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు.. చంద్రయాన్-3 విజయం నవభారత జయధ్వానం.. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్-3 పైనే ఉందన్నారు.. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఆయన.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారని పేర్కొన్నారు. కాగా, చందమామ దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింగా.. ఇప్పటి వరకు చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా, రష్యా, చైనా సరసన ఇప్పుడు భారత్ చేరింది.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ప్రగ్యాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్ నుండి కొద్దిగంటలలో బయటకు రావచ్చు.. లేదా ఒకరోజు పట్టవచ్చు.. అక్కడి పరిస్థితులను బట్టి ప్రగ్యాన్ బయటకు వస్తుందని తెలిపారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.. చంద్రయాన్ 3 విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది సులువైన పని కాదు… దీని వెనుక ఎంతో కష్టపడ్డాం.. ల్యాండర్ స్థితిగతులు పరిశీలించాక రోవర్ ను బయటకు తెస్తాము. దీనికి కొన్ని గంటలు లేదా ఒక రోజు సమయం పట్టవచ్చు అన్నారు. 14 రోజులు చంద్రుడిపై రోవర్ పరిశోధన కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు.. ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగం ఉంటుందని.. దీనితో సూర్యుడి గురించి శోధనలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.. గగన్ యాన్ ప్రయోగం చేపట్టనున్నట్టు ప్రకటించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3
— ISRO (@isro) August 23, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!