NTV Telugu Site icon

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం.. ఇది చంద్రుడిని ఎప్పుడు చేరుకుంటుందంటే?

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్‌-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్‌-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

Also Read: Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. భారత్‌ చరిత్ర సృష్టించాలంటే అది జరగాలి..

ఎల్వీఎం3 రాకెట్‌ మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని, 100 శాతం ప్రయోగ విజయ రికార్డును కొనసాగించింది. ప్రయోగం తర్వాత ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ సరిగ్గా 900 సెకన్ల తర్వాత అంతరిక్ష నౌక చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కక్ష్యలోకి చేర్చింది. ఇకపై స్పేస్ క్రాఫ్ట్ తనంతట తానుగా భూమిని ఐదారు సార్లు చుట్టి వస్తుంది. ఆ తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభిస్తుందని ఇస్రో చీఫ్​ ఎస్. సోమనాథ్ ప్రకటించారు ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3.. దాదాపు 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. తర్వాత చంద్రుడి దిశగా కక్ష్యలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు.

Also Read: Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు

అనంతరం దశలవారీగా దీని కక్ష్యను పెంచుతూ పోతారు. కావాల్సినంత ఎత్తుకు చేరిన తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభించి, ఆగస్టు 5న చంద్ర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూ దశల వారీగా కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడికి 100 కిలోమీటర్ల దగ్గరగా వెళ్తుంది. చివరగా ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు లేదా ఆగస్టు 24వ తేదీన ల్యాండర్‌ను చంద్రుడిపైకి జారవిడుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ గా దిగుతుంది. ఆ వెంటనే ల్యాండర్ పై నుంచి రోవర్ కిందకు దిగి ముందుకు వెళ్తుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతరిక్ష రంగంలో భారత్‌ చరిత్ర సృష్టించినట్లే.

రోవర్ ల్యాండింగ్‌కు ఇస్రో కష్టసాధ్యమైన ప్రాంతాన్ని ఎంచుకుంది. మిగిలిన దేశాలకు సాధ్యంకాని దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటిదాకా చంద్రుడి మధ్యరేఖా ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇస్రో మాత్రం దక్షిణ ధృవ ప్రాంతాన్ని సెలక్ట్ చేసింది. అంతా సవ్యంగా జరిగితే 40 రోజుల తర్వాత రోవర్ చంద్రుడిపై అడుగుపెడుతుంది. అదే జరిగితే చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా నిలుస్తుంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.