NTV Telugu Site icon

Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయం మార్పు

Chandrababu

Chandrababu

Chandrababu Swearing Ceremony: అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది. ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక, ముహుర్తాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా సీఎంఓ ప్రకటించింది. గన్నవరం ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ట్విట్టర్లో సీఎంఓ వెల్లడించింది. తొలుత ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీడీపీ తెలిపింది.

Read Also: CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష

ఇదిలా ఉండగా.. ఏపీ సీఎంఓ ట్విట్టర్ హ్యండ్లర్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎంఓ ట్విట్టర్ ప్రొఫైల్లో జగన్ ఫొటో తొలగించి చంద్రబాబు ఫొటోను అధికారులు పెట్టారు. ఇండియాస్ సన్ రైజ్ స్టేట్ అనే నినాదాన్ని సీఎంఓ ట్విట్టర్లో అధికారులు పెట్టారు. 2014-19 మధ్య కాలంలో ఏపీని ఇండియాస్ సన్ రైజ్ స్టేట్‌గా చంద్రబాబు ప్రమోట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం మారడంతో రాజధాని పనుల్లో కదలిక మొదలైంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే రాజధాని నిర్మాణ పనులకు ఆటంకాల్లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి అమరావతి పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పనులు నిలిపేయడంతో భారీగా పిచ్చి మొక్కలు పెరిగాయి. మట్టి, కంకర కోసం రోడ్లు సైతం తవ్వుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సీఆర్డీయే అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తోంది. రోడ్ల మధ్యలో ఏర్పడిన గుంటలు పూడ్చివేతకు చర్యలు చేపడుతున్నారు. ఐఎఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే – ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడీ నిర్మాణ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తోంది సీఆర్డీఏ. విట్, ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీల సమీపంలోనూ సీఆర్డీఏ పనులు చేయిస్తోంది.76 జేసీబీలు, ప్రోక్లెయినర్లు, యంత్రాలతో సీఆర్డీయే అధికారులు పనులు చేయిస్తున్నారు. అమరావతిలో నిర్మాణ పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు.