NTV Telugu Site icon

Chandrababu: సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం!

Chandrababu

Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్‌ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్‌ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేయనున్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సచివాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రభుత్వం అలంకరించింది.

Read Also: Schools Reopen: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులతో బుధవారం సాయంత్రం సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు.. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, మంత్రుల సమావేశం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం.. రాత్రికి తిరుమలలో కుటుంబంతో కలిసి బస చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ దుర్గగుడికి చేరుకోనున్నారు. దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు..