NTV Telugu Site icon

Kona Ravikumar: స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు..

New Project (20)

New Project (20)

కన్నుల పండుగగా.. పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. స్వయంగా పింఛన్ దారుల వద్దకు వెళ్లిన మొద్దమొదటి సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. సోమవారం ఆయన మాజీ ప్రభుత్వ విప్ రవికుమార్ మాట్లాడుతూ.. “సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తుంటే అవ్వాతాతలు సంతోషంగా ఉన్నారు. వాలంటీర్లు పంపినీ చేసినంత కాలం బిక్కుబిక్కుమని గడిపామని వాపోతున్నారు పించన్ దారులు. వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వం రివ్యూ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ కోనసాగించాలోలేదో అని ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చంద్రబాబుని కోరుతున్నా. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కోందరు ఐఏఎస్ లు ప్రయత్నిస్తున్నారు. దశబ్దాకాలంగా ఉన్న అగ్రిమెంట్ ల స్థానంలో నిరంకుశ అగ్రిమేంట్లను తీసుకొచ్చి కేజీబీవీ ఉపాధ్యాయులను వేదిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగ భద్రత, జీతాల కోసం కేజీబీవీ ఉపాద్యాయులు రోడ్డేక్కారు.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Qantas Flight: ఫ్లైట్‌లో అస్వస్థత.. ప్రాణాలు విడిచిన భారత సంతతి యువతి

వారికి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. “కేజీబీవీ ఉపాద్యాయుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా అధికారులు నిబంధనలు విధించారు. జీతం కోసం, టైం స్కేల్ కోసం నోరేత్త కూడదని, స్కూల్ గ్రామంలో నివాసం ఉండాలని, 24 గంటలు అందుబాటులో ఉండేలా పనిచేసేలా అగ్రిమెంట్ రూపొందించారు. కమీషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, రాజీవ్ విద్యా మిషన్ డైరక్టర్ లు ఇంకా జగన్ మానియా లోనే ఉన్నట్లుంది. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అధ్యాపకులకు న్యాయం జరగకపోతే అసెంబ్లీ లో అధికారులపై పోరాడుతాం.” అని ఆయన పేర్కొన్నారు.