NTV Telugu Site icon

Chandrababu: ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం..

Chandrababu

Chandrababu

Chandrababu: జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజల అభిప్రాయం అర్థమైందన్నారు. ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయని.. మే 13 లాంఛనమేనన్నారు. 1983లో పార్టీ పెట్టినప్పుడు, 1994లో ఇంత కసి చూశానన్నారు. ఫ్యాన్ ముక్కలై డస్ట్ బిన్‌లోకి పోవడం ఖాయమన్నారు. ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి అయినా పెట్టాడా అంటూ ప్రశ్నించారు.

Read Also: AP Pensions: పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ

కర్నూలు పార్లమెంటు బాగా వెనుకబడిందన్నారు. రాయలసీమకు 12 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు చేశానన్నారు. తాగడానికి నీళ్లు లేవు, అభివృద్ధి లేదని.. రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని, ఎత్తిపోతలు అన్ని పాడయ్యాయన్నారు. గురురాఘవేంద్ర లిఫ్ట్ పనిచేయడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి బెంగుళూరు, హైదరాబాద్, గోదావరి జిల్లాలకు వలస వెళ్తున్నారన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ అంటూ చంద్రబాబు విమర్శించారు. యువతను ఆదుకునే బాధ్యత తనదని.. టీడీపీ పేదవాళ్ల పార్టీ అని.. మీతోనే ఉంటామన్నారు. బీసీ నినాదం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. బుట్టా రేణుక పేద మహిళ అంట, బీవై రామయ్య పేదవాడంట అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంత్రాలయంలో ఇసుక, దేవుణ్ణి మింగేశారని విమర్శించారు.

Read Also: AP Polycet 2024: పాలిటెక్నిక్ లో చేరాలనుకుంటున్నారా.. అయితే ఫ్రీ కోచింగ్ మీకోసమే.. ఎక్కడంటే..?!

భూస్వాములు, పెత్తందార్లు, రౌడీల పార్టీ వైసీపీ అని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటివద్దనే 4 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు కాకుండా వేరే వాళ్లతో ఇంటివద్దనే పింఛన్ పంపిణీ చేయించాలన్నారు. బీసీలకు అన్యాయం జరిగింది…కురువలను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా చేర్చాలన్న కోరిక నెరవేరుస్తామన్నారు. చేనేతలు ఎమ్మిగనూరులో ఎక్కువగా వున్నారని.. చేనేతలకు 200, 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేస్తామని.. గోదావరి జలాలు రాయసీమకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీలు గుప్పించారు. జగన్ ఐదేళ్లు సీఎంగా ఉన్నా డీఎస్సీ ఇవ్వలేదన్నారు. ఐదేళ్లలో వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని.. ప్రక్షాళన చేస్తాం, విచారణ చేస్తాం, చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. తాను మంచి డ్రైవర్‌నని.. తన బస్సు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రజలను అడిగారు. గేమ్ ఈజ్ ఓవర్, ఓటమి అన్‌స్టాపబుల్.. ఎవరైనా వస్తే సైకిల్ తొక్కుకుంటూ పోతామన్నారు.