NTV Telugu Site icon

Chandrababu: డోన్‌లో ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

Chandrababu: నంద్యాల జిల్లా డోన్‌లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన…అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు. విధ్వంస పాలనకు, అభివృద్ధికి ఈ ఎన్నికలు సవాల్ అంటూ ఆయన పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేస్తున్నారని.. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి కాలం చెల్లిపోయిందని.. డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. పాలన అంటే బుగ్గన హరికథలు చెప్పడం కాదన్నారు. రాయలసీమకు ఏమి చేసాడని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు.

Read Also: Amit Shah Video: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు.. అమిత్ షా వీడియోపై విచారణ..

మీ పట్టాదారు పసుపుస్తకాలపై జగన్ ఫోటో వేసుకుంటాడా.. ఆస్తి వాళ్ళ తాత ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. ప్రజల భూములన్నీ జగన్ పేరుతో రాసుకుంటున్నాడని.. ఇది చాలా ప్రమాదకరమని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూమి మీరు కాపాడుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. మద్యం ధరలు పెరిగాక చేసిన కూలి డబ్బులు తక్కువ వచ్చి భార్య దగ్గర లాక్కుంటున్నారని చంద్రబాబు అన్నారు. కరెంటు చార్జీలు 9 సార్లు పెరిగాయని.. తాను వస్తే కరెంటు చార్జీలు ఉండవు, కరెంటు కోతలు ఉండవన్నారు. తాను వస్తే చెత్త పన్ను రద్దు చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. విశ్వసనీయత లేదని చెప్తున్నారు.. తన విశ్వసనీయత ఏ మారు మూలకు వెళ్లినా తెలుస్తుందని చంద్రబాబు తెలిపారు. పదేళ్లయినా రాజధాని లేదని ఆయన మండిపడ్డారు.