NTV Telugu Site icon

Chandrababu: ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి..!

Babu

Babu

Chandrababu: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పెడనలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయాం. అధికారంలోకి రాగానే వీరిద్దరిని గౌరవిస్తాం అన్నారు. శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను నట్టెట్లో ముంచేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి.. బాలశౌరీ, కృష్ణ ప్రసాద్ గెలుపు తధ్యం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఇన్నాళ్లూ పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుగ్గలు నిమిరుతున్నాడు.. ముద్దులు పెడుతూ మళ్లీ బయలుదేరాడు అని ఎద్దేవా చేశారు.

Read Also: TMC manifesto: సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!

ఇక, మావి మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) జెండాలు కానీ.. ఏజెండా ఒక్కటే అన్నారు చంద్రబాబు.. మేం ముగ్గురం కలిసి వస్తున్నాం.. జగన్ శవాలతో వస్తున్నాడని విమర్శించారు. విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. 2019లో మేం గెలిచి ఉంటే.. కృష్ణాలో నీటి సమస్యే ఉండేది కాదు. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచేశాడని దుయ్యబట్టారు. అమరావతిని నాశనం చేశాడని ఆరోపించారు.. బందరు పోర్టు, అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు. టీడీపీ ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. జగన్ అమలు చేసేవి నవరత్నాలు కావు.. నకిలీ రత్నాలని సెటైర్లు వేశారు. మద్యపాన నిషేధం చేశాడా..? ప్రత్యేక హోదా తెచ్చాడా..? అని ప్రశ్నించారు. ప్రజలతో నాసిరకం మద్యం తాగిస్తూ.. జే-గన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. పోలీసులను జగన్ తన బానిసలని అనుకుంటున్నాడు. బటన్ నొక్కడం తప్ప జగన్‌కు ఏమీ తెలియదన్నారు. బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు..? ఇంట్లో ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది. సంపద సృష్టికి తెలివి కావాలని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.