Site icon NTV Telugu

Chandrababu Selfie Challenge: చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. ఇవే సజీవ సాక్ష్యం..!

Chandrababu

Chandrababu

Chandrababu Selfie Challenge: సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరులో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించిన టీడీపీ అధినేత.. టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి సీఎం జగన్‌కు ఛాలెంజ్ విసురుతూ ట్వీట్ చేశారు.. ”చూడు.. జగన్! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ కామెంట్ పెట్టారు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని..? నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతో ట్వీట్ చేశారు చంద్రబాబు.. తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరిన చంద్రబాబు.. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని క్యాడర్, లీడర్లకు పిలుపునిచ్చారు.

కాగా, ఇప్పటికే యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తోన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తెచ్చిన ప్రాజెక్టులు, నిర్మించిన ప్రాజెక్టులు ఇలా.. తన యాత్రలో ఎదురయ్యే అన్నింటి దగ్గర సెల్ఫీలు దిగి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే.. మేం తెచ్చిన ప్రాజెక్టు ఇది.. ఇలాంటి ఒక్కటైనా తెచ్చారా జగన్‌ రెడ్డీ అంటూ సీఎంను సోషల్‌ మీడియాలో నిలదీస్తూ వస్తున్నారు లోకేష్.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగి.. సెల్ఫీ ఛాలెంజ్‌ విసరడం చర్చగా మారింది.

 

Exit mobile version