NTV Telugu Site icon

Chandrababu Arrest: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌..

Chandrababu 2

Chandrababu 2

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు మరింత హీట్‌ పెంచుతోంది.. ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు, హైకోర్టు వరకే పరిమితమైన ఈ కేసు.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు.. ఆయన తరపున న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.

Read Also: Mynampally: మల్కాజ్‌గిరి టికెట్‌ నాకొద్దు.. పార్టీకే రాజీనామా చేస్తున్న.. మైనం పల్లి లేఖ

ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్ కేసులో నిన్న హైకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తున్నట్టు హైకోర్టు న్యాయూర్తి ప్రకటించగా.. మరోవైపు చంద్రబాబు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది.. నిన్న చంద్రబాబు రిమాండ్‌ పూర్తి కాగా.. రిమాండ్‌ను రెండు రోజుల పాటు పొడిగించిన న్యాయస్థానం.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతించింది.. దీంతో.. ఈ రోజు ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐటీ అధికారులు.. కోర్టు ఆదేశాలను అనుగుణంగా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును ప్రశ్నించనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.. ఇక, ప్రతీ గంటకు ఐదు నిమిషాల పాటు ఆయనకు బ్రేక్‌ ఇస్తు్నారు.. ఈ రోజుతో పాటు రేపు కూడా చంద్రబాబును ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు.