NTV Telugu Site icon

Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా

Cbn

Cbn

Tarakaratna Political: హైదరాబాద్‌లో తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. తారకరత్న మృతి చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. తారకరత్న కోలుకుని వస్తారని ఆశించామని, కానీ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తారని అనుకోలేదన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 23రోజులు తారకరత్న మృత్యువుతో పోరాడి చనిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తారీఖుకు 40సంవత్సరాలు వస్తాయని.. అతి చిన్న వయసులో కన్నుమూయడం శోచనీయమన్నారు.

Read Also: Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం

ఒక మంచి భవిష్యత్‌ ఉన్న వ్యక్తిని ఇలా మధ్యలోనే అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని తారకరత్న తనతో చెప్పినట్లు వెల్లడించారు. ఎప్పుడూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉండేవారన్నారు. దీంతో ఆయనకు అవకాశం ఇద్దామనుకున్నామని వెల్లడించారు. దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని ఆయనతో చెప్పానని తెలిపారు. ఈలోపే తారకరత్న చనిపోవడం బాధాకరమన్నారు. తారకరత్న పిల్లలను చూస్తే చాలా బాధగా ఉందని.. భగవంతుడు ఆ కుటుంబానికి అన్నివిధాలా సహకరించాలన్నారు. తాము కూడా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read Also:Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్

Show comments