Site icon NTV Telugu

Chandrababu: 15 నుండి 20 మందికి నో టికెట్స్.. స్పష్టం చేసిన చంద్రబాబు..!

Babu

Babu

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టాయి.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. పలువురు సిట్టింగ్‌ల స్థానాలను మారుస్తూ వస్తుండగా.. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లిన వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారట.. వచ్చే ఎన్నికల్లో సీట్లు, మార్పులపై అభ్యర్థులకు క్లారిటీ ఇస్తోన్నారట.. ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని స్పష్టంగా చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి లాంటి కుటుంబాలకు ఒకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..

Read Also: Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Live & Update

మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు సంకేతాలిచ్చారని పార్టీలో చర్చ సాగుతోంది.. పెడనలో జాగ్రత్తగా పని చేసుకోమని కాగిత కృష్ణ ప్రసాద్ కే చెప్పారట టీడీపీ అధినేత.. అవనిగడ్డ సీటుపై జనసేనతో సంప్రదింపులు కొనసాగుతుండగా.. మొత్తం 175 స్థానాలనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు – పవన్‌ కల్యాణ్‌ ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. బీజేపీ పొత్తు తెర పైకి రావడంతో అభ్యర్థుల అధికారిక ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.. ఈ లోగా అనధికారికంగా కొందరికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తున్నారట టీడీపీ సుప్రీం చంద్రబాబు నాయుడు.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version