NTV Telugu Site icon

Palla Srinivas Yadav: ఏపీ టీడీపీకి కొత్త చీఫ్‌.. పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు..

Palla Srinivas Yadav

Palla Srinivas Yadav

Palla Srinivas Yadav: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన తర్వాత.. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటు.. మరోవైపు పార్టీని చక్కదిద్దే పనిలో పడిపోయారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీకి కొత్త బాస్‌ను నియమించారు చంద్రబాబు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను నియమించారు.. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన శ్రీనివాస్‌ యాదవ్.. తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ యాదవ్ రికార్డు సృష్టించాడు.. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు.

Read Also: No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..

ఇక, యాదవ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నట్టుగా తెలుస్తోంది.. తన మంత్రి వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి చోటు కల్పించిన ఆయన.. టీడీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా యాదవ వర్గం చేతిలోనే పెట్టారు.. దీంతో.. యాదవ సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నుంచి 95 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విజయం సాధించారు పల్లా శ్రీనివాస్ యాదవ్.. ఆయన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.. కానీ, పల్లా శ్రీనివాస్‌ యాదవ్.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే.. 2019 ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూశారు.. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, నియోజకవర్గంపై మరింత కేంద్రీకరించి పనిచేశారు.. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు.. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో.. పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌కు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పచెప్పారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Show comments